TG: మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని CM రేవంత్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా జర్నలిస్టులను ప్రత్యేకంగా సత్కరించిన ఆయన.. మహిళలను ఆర్థికంగా బలపరచాలని తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి వన్ ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మార్చాలంటే మహిళల సహాకారం ఎంతో అవసరమని, వారితోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.