GNTR: తెనాలి పట్టణంలోని వీ.ఎస్.ఆర్ కాలేజ్ ఎదుట ఏర్పాటు చేసిన మాజీ కేంద్రమంత్రి, స్వర్గీయ కొత్త రఘురామయ్య గారి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.