KMM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదివారం మహిళా మణులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని గౌరవప్రదంగా జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి మహిళ మొహంలో చిరునవ్వు ఉండాలని మహిళా సాధికారిక కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.