NGKL: బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన బక్క వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందగా, ఆ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. వారిని పరామర్శించిన DNR యువసేన సభ్యులు, ఆదివారం బాధితుని ఇంటికి వెళ్లి రూ. 5,000 నగదును తక్షణ సాయంగా అందజేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, DNR యువసేన సభ్యులు పాల్గొన్నారు.