MHBD: తొర్రూరు మండలం కంటాయాపాలెం గ్రామానికి చెందిన భానోత్ కోటికి మంజూరైన రూ.60,000 సీఎం సహాయనిధి చెక్కును ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మోకాటి వెంకన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు CMRF పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.