E.G: రాజమండ్రి పర్యటనలో ఉన్న జాతీయ SC కమిషన్ ఛైర్మన్ కిషోర్ మాక్వాన్‌ను BJP SC మోర్చా రాష్ట్ర కార్యదర్శి మట్టాడి వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సామాజిక అంశాలపై చర్చించి, ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా SC మోర్చా అధ్యక్షుడు తగరపు సురేశ్ పాల్గొన్నారు. సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఛైర్మన్‌ను కోరారు.