MDK: టేక్మాల్ మండలంలోని చంద్రు తండాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అనుమతి లేకుండా వేసిన బోరు బావిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సర్కారీ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని బోరు తవ్వుతున్నట్లు సమాచారం అందడంతో తహశీల్దార్, ఆర్ఐ ఘటనా స్థలానికి చేరుకుని పనులను నిలిపి వేయించారు. ప్రభుత్వ స్థలలను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.