TG: మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు@ గణపతి పోలీసులకు టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. CM రేవంత్ పిలుపుతో వారం, 10 రోజుల్లో గణపతి లొంగిపోయే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా శనివారం రేవంత్ ఎదుట నలుగురు అగ్రనేతలు సహా 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్నది ఏడుగురే అని DGP శివధర్ రెడ్డి అధికారికంగానూ ప్రకటించిన సంగతి తెలిసిందే.