GNTR: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్యకర దుష్ప్రచారంపై తెనాలికి చెందిన ITDP నాయకురాలు జెట్టి రేణుక శనివారం మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేశారు. TTD ఛైర్మన్ BR నాయుడు వ్యవహారంలో తనకు సంబంధం లేకపోయినా, కొందరు YCP సోషల్ మీడియా సభ్యులు తన ఫోటోలు వాడుతూ అసత్య పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.