న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ T20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్ కప్ టోర్నీకి 4 నెలల ముంగిట ఆయన రిటైర్ అవడం గమనార్హం. కాగా 2011లో T20 అరంగేట్రం చేసిన కేన్ మొత్తం 93 మ్యాచుల్లో 18 ఫిఫ్టీలతోపాటు 2575 రన్స్ చేశాడు. ఇందులో 75 మ్యాచుల్లో జట్టును నడిపించాడు.