WWC 2025 Final: సౌతాఫ్రికాతో బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతున్న భారత మహిళా జట్టుకు టీమిండియా అబ్బాయిలు, కోచింగ్ స్టాఫ్ తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఆత్మవిశ్వాసంతో ఒక్కటిగా రాణించి గెలవాలని, కప్ సాధిస్తారని తమకు నమ్మకముందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.