నెల రోజులుగా క్రికెట్ ప్రపంచానికి వినోదం పంచిన T20 వరల్డ్ కప్ తుదిదశకు చేరుకుంది. వరుసగా 2వ సారి ఈ టైటిల్ సొంతం చేసుకునేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ రేపు అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. టైటిల్ నిలుపుకోవాలని సూర్యసేన.. T20 ఫార్మాట్లో తొలి ICC టైటిల్ సాధించాలని శాంట్నర్ నేతృత్వంలోని కివీస్ భావిస్తున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.