KMM: ఖమ్మం రూరల్ పరిధిలో నగదు లావాదేవీల కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. కొండాపురానికి చెందిన ఎం.నాగేశ్వరరావు 2017లో జనార్దన్ రావు వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకుని ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. బాధితుడు కోర్టును ఆశ్రయించగా, విచారణలో నేరం రుజువు అయ్యింది. దీంతో ఎం. నాగేశ్వరరావుకు జడ్జి కాసర గడ్డ దీప ఆరునెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చారు.