SDPT: సిద్దిపేట పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో వెలిసిన దుర్గ భవాని అమ్మవారికి మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు వారాలుగా కొనసాగుతున్న కార్యక్రమంలో భాగంగా అమ్మవారి సన్నిధిలో లలిత సహస్రనామ పారాయణం చేశారు. పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. పూజల అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.