NLR: గూడూరులో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 100 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్వో లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కలువాయి(M) నుంచి బియ్యాన్ని అక్రమ మార్గాల్లో గూడూరుకు తరలించారన్నారు. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనను స్థానికులే గుర్తించి తమకు సమాచారం ఇచ్చారన్నారు.