గిరిజన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గానూ ఈనెల 25 నుంచి ఏప్రిల్ 6 వరకు కేంద్ర క్రీడాశాఖ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ నిర్వహించనుంది. కేంద్ర క్రీడాశాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత ఒలింపిక్ సంఘం, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఛత్తీస్గఢ్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. రాయ్పూర్, జగ్దల్పూర్, సర్గుజాలో పోటీలు నిర్వహించనున్నారు.