• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఈ 5 ‘అత్యధిక’ రికార్డ్‌లు బ్రేక్ అయ్యేనా?

➤ అత్యధిక పరుగులు: 8661* (విరాట్ కోహ్లీ)➤ అత్యధిక వికెట్లు: 221* (యుజ్వేంద్ర చాహల్)➤ అత్యధిక వ్యక్తిగత స్కోర్: 175 (క్రిస్ గేల్)➤ అత్యధిక జట్టు స్కోర్: 287/3 (SRH)➤ అతి పెద్ద ఛేదన: 262 (PBKS)

March 28, 2026 / 09:26 AM IST

2025-ఉత్తమ ప్లేయర్లుగా హార్దిక్, నవనీత్

భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, నవనీత్ కౌర్ ‘హాకీ ఇండియా-ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2025’ అవార్డులు అందుకున్నారు. శుక్రవారం జరిగిన హాకీ ఇండియా వార్షిక పురస్కారాల ప్రదానోత్సవంలో హాకీ దిగ్గజం జాఫర్ ఇక్బాల్‌కు ‘మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ దక్కింది. ఈ వేడుకకు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీడ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

March 28, 2026 / 09:14 AM IST

IPL: వార్న్ రికార్డు.. ఇప్పటికైనా బ్రేక్ అవుతుందా?

IPLలో సుదీర్ఘంగా బ్రేక్ కాని రికార్డుల్లో షేన్ వార్న్(RR) ‘2008లో 13 విజయాల’ రికార్డు ఒకటి. కెప్టెన్‌గా ఓ సీజన్‌లో అత్యధికంగా అందుకున్న విజయాల్లో ఇదే అత్యధికం. ఆపై ధోనీ(2017-CSK), జార్జ్ బెయిలీ(2014-PBKS), రోహిత్(2017-MI) తలో 12 విజయాలు సాధించారు. ఇక IPL 2026లో ప్లేఆఫ్స్ వరకు వెళ్లిన జట్లు 16/17 మ్యాచులు ఆడతాయి. మరి వార్న్ రికార్డ్ బ్రేక్ అవుతుందేమో చూడాలి.

March 28, 2026 / 08:53 AM IST

IPL: భారీ రికార్డ్‌కు 2 వికెట్ల దూరంలో భువీ

RCB స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ భారీ రికార్డ్‌కు కేవలం 2 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ IPL-2026 సీజన్ ఓపెనర్‌లో SRHపై భువీ ఇద్దరినీ ఔట్ చేసినా.. టోర్నీలో 200 వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. 221 వికెట్లతో యుజ్వేంద్ర చాహల్(PBKS) అగ్రస్థానంలో ఉండగా.. భువీ(198), నరైన్(KKR) తర్వాతి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు.  

March 28, 2026 / 07:42 AM IST

‘దేశం కోసం ఆడటమే నా అంతిమ లక్ష్యం’

జమ్మూకశ్మీర్ తమ తొలి రంజీ ట్రోఫీ(2025/26)ని అందుకోవడంలో ఆకిబ్ నబీ 60 వికెట్లతో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. IPLలో ఢిల్లీకి ఆడనున్న ఈ ప్లేయర్.. తన అంతిమ లక్ష్యం భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమేనని తెలిపాడు. తనను వేలంలో ఢిల్లీ రూ.8.40 కోట్లకు తీసుకోవడం సంతోషంగా ఉందన్నాడు. IPLలో మెరుగ్గా రాణించి జాతీయ జట్టులో ఆడే ఛాన్స్ పొందితే తన కల నిజమైనట్లేనని పేర్కొన్నాడు.

March 28, 2026 / 07:22 AM IST

IPL ప్రారంభోత్సవ వేడుకలు రద్దు

IPL 19వ సీజన్ ప్రారంభానికి ముందు జరిగే వేడుకలను BCCI అధికారికంగా రద్దు చేసింది. గతేడాది జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులు గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఎలాంటి ప్రారంభోత్సవ వేడుకలు ఉండవని స్పష్టమైంది. అయితే ఈ IPL 2026 ముగింపు వేడుకల కోసం లీగ్ నిర్వాహకులు & BCCI ప్లాన్ చేస్తున్నట్లు బోర్డ్ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.

March 28, 2026 / 06:46 AM IST

నేటి నుంచే పరుగుల పండుగ

వేసవిలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు IPL సిద్ధమైంది. 19వ సీజన్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి 65 రోజుల పాటు వినోదం పంచనుంది. ఈ సీజన్‌లో 10 జట్ల మధ్య 13 వేదికల్లో 84 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఇవాళ్టి సీజన్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ RCBతో SRH ఢీకొననుంది. IPL లైవ్ మ్యాచ్‌లను Star Sports, JioHitstar Appలో వీక్షించవచ్చు.

March 28, 2026 / 06:32 AM IST

భారత్‌కు ఆడటమే లక్ష్యం: ఆకిబ్ నబీ

జమ్ముకాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ రూ.8.40 కోట్ల భారీ ధరతో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున IPLలో అరంగేట్రం చేయబోతున్నాడు. కేవలం రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీని DC దక్కించుకుంది. వేలం రోజున తన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారని నబీ తెలిపాడు. IPLలో భారీ ధర పలికినప్పటికీ, తన లక్ష్యం మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమేనని అతడు స్పష్టం చేశాడు.

March 27, 2026 / 09:29 PM IST

IPL: RCBకి బిగ్ షాక్

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ఆర్సీబీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు బౌలర్ శ్రీలంక ప్లేయర్ నువాన్ తుషారా ఫిట్‌నెస్ టెస్టులో విఫలయ్యాడు. దీంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అతనికి NOC నిరాకరించడంతో అతను వెంటనే భారత్ వచ్చే అవకాశం లేదు. అయితే, మరో 4-5 రోజుల్లో నిర్వహించే తదుపరి ఫిట్‌నెస్ టెస్టులో నెగ్గితేనే తుషారా IPLలో పాల్గొంటాడు.

March 27, 2026 / 09:20 PM IST

ఆస్ట్రేలియా క్రికెట్ గ్రౌండ్‌లో ఇమ్రాన్ ఖాన్ రచ్చ!

ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్‌లో ఇమ్రాన్ ఖాన్ టీ-షర్ట్ ధరించిన అభిమానిని సెక్యూరిటీ అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా రంగంలోకి దిగింది. ఇమ్రాన్ కేవలం రాజకీయ నాయకుడే కాదని, ప్రపంచకప్ విజేత అని గుర్తుచేసింది. మానవతా దృక్పథంతో చూడాలంటూ ఆ అభిమానిని స్టేడియంలోకి అనుమతించింది. ప్రస్తుతం ఇమ్రాన్ అనారోగ్యంతో పాకిస్తాన్ జైలులో విషయం తెలిసిందే.

March 27, 2026 / 09:00 PM IST

వారిద్దరూ కలిస్తే పరుగుల సునామీ ఖాయం..!

సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే కలిసి టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఓ ‘డ్రీమ్ కాంబో’ అని CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఈ జోడీని రజినీకాంత్, కమల్ హాసన్లతో పోల్చాడు. ఈ సీజన్‌లో ఈ ఇద్దరు టాలెంటెడ్ ప్లేయర్లు కలిసి ఆడే అవకాశం ఖచ్చితంగా వస్తుందని తాను నమ్ముతున్నట్లు రుతురాజ్ పేర్కొన్నాడు. వీరిద్దరూ క్రీజులో ఉంటే పరుగుల సునామీ ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.

March 27, 2026 / 08:50 PM IST

SRH vs RCB: హెడ్ టు హెడ్ రికార్డ్స్

IPL చరిత్రలో RCB, SRH మధ్య రికార్డులు హోరాహోరీగా ఉన్నాయి. ఈ జట్లు ఇప్పటివరకు 26 సార్లు తలపడగా.. RCB 11, SRH 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ముఖ్యంగా 2016 IPL ఫైనల్లో కూడా RCBపై SRH విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, రేపు మ్యాచ్ జరగనున్న చిన్నస్వామి స్టేడియంలో మాత్రం 9 మ్యాచ్‌ల్లో RCB 5 సార్లు గెలిచి SRHపై పైచేయి సాధించింది.

March 27, 2026 / 07:59 PM IST

RCBతో మ్యాచ్‌.. SRH ‘ప్లేయింగ్-11’ ఇదే!

RCBతో రేపటి మ్యాచ్ కోసం SRH పటిష్ట జట్టుతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా విధ్వంసకర జోడీ అభిషేక్, హెడ్ బరిలోకి దిగనుండగా, మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్(C), క్లాసెన్, లివింగ్‌స్టోన్ బ్యాటింగ్‌కు రానున్నారు. ఆల్‌రౌండర్లుగా నితీష్ రెడ్డి, అనికేత్ వర్మ, బౌలర్లుగా బ్రైడన్ కార్స్, హర్ష్ దూబే, హర్షల్, మావి తుది జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం.

March 27, 2026 / 07:43 PM IST

IPL: కామెంటేటర్‌గా అశ్విన్ ఎంట్రీ

IPL- 2026 సీజన్ కోసం ‘జియోహాట్‌స్టార్’ తమ హిందీ కామెంట్రీ ప్యానల్‌ను ప్రకటించింది. అశ్విన్ తొలిసారిగా కామెంట్రీ బాక్స్‌లోకి అడుగుపెట్టబోతుండటం విశేషం. ఈ ప్యానల్‌లో సెహ్వాగ్, కుంబ్లే, హర్భజన్ వంటి దిగ్గజాలతో పాటు రైనా, ఇర్ఫాన్ పఠాన్, ఆకాష్ చోప్రా, పుజారా, చావ్లా, ఉమేష్ యాదవ్, ఆదిత్య తారే వంటి మాజీ క్రికెటర్లు ఉన్నారు.

March 27, 2026 / 06:57 PM IST

IPL: తొలి మ్యాచ్‌కు హెజెల్‌వుడ్ దూరం

IPL-2026 ఆరంభ మ్యాచ్‌లో RCB, SRH జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ కీలక పోరులో RCB స్టార్ పేసర్ జోష్ హెజెల్‌వుడ్ బరిలోకి దిగడం లేదని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పష్టం చేశాడు. గాయం నుంచి కోలుకుని నిన్ననే జట్టుతో చేరినప్పటికీ, అతనికి మరింత విశ్రాంతి అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ అందుబాటులో లేకపోవడం RCB బౌలింగ్‌కు పెద్ద ఎదురుదెబ్బే.

March 27, 2026 / 05:45 PM IST