T20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్లేయింగ్-11లో కుల్దీప్ యాదవ్‌ను తప్పనిసరిగా ఆడించాలని సూచించాడు. ఇందుకోసం తిలక్ లేదా దూబెలలో ఒకరిని తప్పించాలని పేర్కొన్నాడు. కుల్దీప్ను జట్టులోకి తీసుకోవడం ద్వారా భారత్ విజయావకాశాలు మెరుగవుతాయన్నాడు.