ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ‘గంగోత్రి’ మూవీతో హీరోగా మొదలైన ఆయన ప్రయాణం, ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్‌కు చేరింది. తన అద్భుతమైన డ్యాన్స్, నటనతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అంతేకాదు ‘పుష్ప’ సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు గెలుచుకుని తెలుగు సినిమా గౌరవాన్ని పెంచాడు. రాబోయే సినిమాలతో సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.