VKB: జిల్లాలో అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు గత వారం రోజుల్లోనే 13 కేసులు నమోదు చేశారు. యాలాల్ పరిధిలో 8 ఇసుక ట్రాక్టర్లు, కరణ్కోట్లో ఒక కలప లారీ, నవాబ్‌పేట్‌లో 3 ఎర్రమట్టి లారీలను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 51 కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.