IPL-2026 ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు పేసర్ యర్రా పృథ్వీరాజ్ గాయం కారణంగా మెగాటోర్నీకి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కుల్వంత్ ఖేజ్రోలియాను జట్టులోకి తీసుకుంది. కాగా, APకి చెందిన పృథ్వీరాజ్‌ను గతేడాది జరిగిన వేలంలో రూ. 30 లక్షలకు GT సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
IPL ట్రేడ్ డీల్‌లో సంజూ శాంసన్ RR నుంచి CSKలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో రాజస్థాన్ నుంచి చెన్నైకి వచ్చిన రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే, అజింక్యా రహానే ట్రోఫీ గెలిచారు. వాట్సన్(2018), ఉతప్ప(2021), రహానే(2023) అయితే CSK తరఫున తొలి టోర్నీలోనే కప్ అందుకున్నారు. ఈ క్రమంలో సంజూ కూడా ఈ సారి కప్ గెలుస్తాడని CSK ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
బెంగళూరు వేదికగా IPL 19వ సీజన్ ఓపెనర్‌లో RCB, SRH తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముందు టోర్నీ ప్రారంభ వేడుకలను BCCI రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత సీజన్ ఫైనల్ తర్వాత మరణించిన 11 మందికి గౌరవ సూచికగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అయితే సీజన్ ఫైనల్‌కు ముందు ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.
మరో రెండు రోజుల్లో IPL 2026 ప్రారంభం కానుండగా.. SRH రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ ఆడతాడా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై స్పందించిన కమిన్స్.. సీజన్ సెకండ్ ఆఫ్ నాటికి జట్టులో చేరతానని, గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉందని, నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో SRH ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ డెబ్యూకి ముందు IPLలో ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్(POTF)’ అందుకోవడం ముగ్గురికే సాధ్యమైంది. ఈ లిస్టులో తొలి ప్లేయర్ మన్విందర్ బిస్లా(KKR). 2012లోనే POTF అందుకున్న బిస్లా.. ఇప్పటికీ దేశానికి ఆడలేకపోయాడు. అటు 2014లో ఈ ఘనత సాధించిన మనీష్ పాండే(KKR).. 2015లో టీమిండియాలో చేరాడు. ఇక 2017లో POTF పొందిన కృనాల్ పాండ్యా(MI) కూడా 2018లో BCCI పిలుపు అందుకున్నాడు.
స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్న రహానే.. కోహ్లీని చూసి నేర్చుకోవాలని మహ్మద్ కైఫ్ సూచించాడు. గతంలో కోహ్లీకీ ఇదే పరిస్థితి అని.. అయితే తన ఆటపై వచ్చిన విమర్శలకు అతను ఆటతోనే సమాధానమిచ్చాడని గుర్తుచేశాడు. స్పిన్నర్లపై బలంగా, నేరుగా కొట్టే షాట్లపై రహానే దృష్టి పెట్టాలన్నాడు. గతేడాది రహానే మంచి అరంభాలు పొందినా.. పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయాడని పేర్కొన్నాడు.
IPL 2026 ప్రారంభానికి ముందు అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్, యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. అతను తరచూ రిల్స్ చేస్తూ తిరుగుతున్నాడని, ఇది అతని పని కాదన్నారు. యువరాజ్‌లా కావాలంటే మరో యుగం పడుతుందని. యువ క్రికటర్లు క్రమశిక్షణ అలవరచుకోవాలని హితవు పలికారు. ప్రతి బంతినీ బాదాలని కాకుండా డిఫెన్స్ కూడా ఆడాలని అభిషేక్‌కి సూచించారు.
సౌత్ ఆసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF) U20 ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇవాళ భారత్, పాక్ తలపడనున్నాయి. సా.4:15 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇవాళే తమ తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. పాక్, బంగ్లాతో కలిసి ‘గ్రూప్-B’లో ఉంది. ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే భారత్ నేరుగా సెమీస్‌కు చేరే ఛాన్స్ ఉంటుంది. అటు బంగ్లా చేతిలో తొలి పోరు ఓడిన పాక్.. ఇవాళ ఎలా ఆడుతుందో చూడాలి.
RCB ₹16,500Crకు అమ్ముడుపోవడంపై ఆ ఫ్రాంచైజీ మాజీ ఓనర్ విజయ్ మాల్యా హర్షం వ్యక్తంచేశారు. 2008లో RCBని తాను ₹450Crకు తీసుకున్నప్పుడు అంతా విమర్శించి, నవ్వారని గుర్తుచేసుకున్నారు. యువ కోహ్లీని తీసుకోవడం వంటి మరపురాని జ్ఙాపకాలతో RCB తన DNAలో భాగంగా ఉండిపోతుందన్నారు. మాల్యా 2008లో యూనైటెడ్ స్పిరిట్స్(USL) ద్వారా RCBని కొనగా.. 2012లో RCB సహా USLను డియాజియో సొంతంచేసుకుంది.
మహ్మద్ షమీ తనకు అన్నలాంటివాడని భారత పేసర్ ముకేశ్ కుమార్ పేర్కొన్నాడు. బెంగాల్ తరఫున ఇద్దరం కలిసి ఆడామని.. అనుకున్నట్లుగా ఆడలేకపోయినప్పుడు షమీ వద్దకు వెళ్లి సలహా తీసుకుంటానని చెప్పాడు. షమీ చాలా అండగా ఉంటాడని, అతని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ముకేష్ చెప్పుకొచ్చాడు. కాగా భారత జట్టులోకి రీఎంట్రీ కోసం ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఎంతో కాలంగా ఎదురుచేస్తున్నారు.
వైట్ బాల్ క్రికెట్‌లో MS ధోనీ తన కంటే గొప్ప కెప్టెన్ అని దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ధోనీ భారత్‌కు 2011 వన్డే వరల్డ్ కప్ అందించాడని.. తాను జట్టును 2003 టోర్నీలో రన్నరప్‌గా మాత్రమే నిలపగలిగానని పేర్కొన్నాడు. తమ కాలంలో T20 WC లేదని, జార్ఖండ్ నుంచి తొలి క్రికెటర్ అయిన ధోనీ.. దిగ్గజంగా ఎదగడం చూసి గర్వపడుతున్నట్లు దాదా తెలిపాడు.
భారత మహిళల జట్టుకు వన్డే వరల్డ్ కప్-2025 విజయంతో ప్రపంచంలో ఎక్కడైనా ట్రోఫీలు గెలవగలమనే నమ్మకాన్ని ఇచ్చిందని కెప్టెన్ హర్మన్ పేర్కొంది. ఆ విజయం తర్వాత అభిమానులు, మీడియా తదితరుల నుంచి తమకు దక్కిన గుర్తింపే వేరని తెలిపింది. ఈ ఏడాది జరిగే T20 WCలోనూ టైటిల్ కోసం శ్రమిస్తామని చెప్పింది. కాగా ఇంగ్లండ్-వేల్స్ వేదికగా జూన్ 12-జూలై 5 మధ్య మహిళల పొట్టి మెగా టోర్నీ జరగనుంది.
ధురంధర్-2 దెబ్బకు పాక్‌లో భారత గూఢచరుల కోసం పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. ‘మూవీ చూశాక ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. ఎదుటివారు ఇండియన్ ఏజెంట్ ఏమోననే అనుమానంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నా. దీనిపై దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుని బెగ్గర్స్ మొదలు అందరినీ విచారించాలి’ అని పేర్కొన్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఎక్కువ మంది IPL కెప్టెన్లు వ్యతిరేకించారు. నిన్నటి కెప్టెన్ల మీట్‌లో విస్తృత చర్చ జరగ్గా.. దీనిపై IPL 2027 తర్వాతే సమీక్ష ఉంటుందని BCCI వర్గాలు వాళ్లతో చెప్పాయట. రెండేళ్ల క్రితమే దీన్ని రోహిత్ వ్యతిరేకించగా.. ఇటీవల కాలంలో కోహ్లీ, అక్షర్ తదితరులూ అదే మాట పలికారు. ఈ రూల్ వల్ల జట్టులో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం తగ్గుతుందనే ఆందోళన నెలకొంది.