WPL: భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్ ఇప్పటివరకు అత్యధిక ధర దక్కించుకుంది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ.1.90 కోట్లకు దక్కించుకుంది. సిమ్రాన్ బేస్ ధర రూ.10 లక్షలు కాగా.. ఢిల్లీ, గుజరాత్ పోటీపడ్డాయి. అలాగే, ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ బేస్ ధర రూ.50 లక్షలు కాగా.. ఆమెను తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.
WPL: భారత్‌కు చెందిన 16 ఏళ్ల జి కమలిని భారీ ధర పలికింది. తమిళనాడుకు చెందిన వికెట్‌కీపర్ కమలిని కనీస ధర రూ.10 లక్షలు కాగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆమె కోసం పోటీపడ్డాయి. చివరికి కమలినిని MI రూ.1.60 కోట్లకు దక్కించుకుంది. ఈమె అండర్-19 మహిళల T20 ట్రోఫీలో 8 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేసి సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
బెంగళూరు వేదికగా WPL ప్లేయర్ల మినీ వేలం మొదలైంది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్‌ను రూ.1.70 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఆమె కనీస ధర రూ.50 లక్షలు కాగా.. గుజరాత్, యూపీ వారియర్స్ పోటీపడ్డాయి. చివరకు గుజరాత్ దక్కించుకుంది. బేస్ ధర రూ.30 లక్షలతో వేలంలో బరిలో నిలిచిన భారత స్పిన్నర్ పూనమ్ యాదవ్ అన్‌సోల్డ్‌గా మిగిలింది.
మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేయర్ల వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో ఐదు జట్లు క్రీడాకారులను కొనుగోలు చేయనున్నాయి.➢ గుజరాత్ జెయింట్స్: రూ.4.4 కోట్లు (4 స్లాట్లు)➢ ఆర్సీబీ: రూ.3.25 కోట్లు (4 స్లాట్లు)➢ యూపీ వారియర్స్: రూ.3.90 కోట్లు (3 స్లాట్లు)➢ ఢిల్లీ క్యాపిటల్స్: రూ.2.5 కోట్లు (4 స్లాట్లు ఖాళీ)➢ ముంబై ఇండియన్స్: రూ.2.65 కోట్లు (4 స్లాట్లు)
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 405/7 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ(45*), మిచెల్ స్టార్క్(7*) క్రీజులో ఉన్నారు. హెడ్ 152, స్టీవెన్ 101, ఖవాజా 21, మెక్ స్వీనీ 9, లబుషేన్ 12, మిచెల్ 5, కమిన్స్ 20 రన్స్ చేశారు. బుమ్రా 5 వికెట్లు.. నితీశ్, సిరాజ్ చెరో వికెట్...
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విన్నర్‌గా 18ఏళ్ల కుర్రాడు గుకేష్ గెలిచి చరిత్ర సృష్టించాడు. తాజాగా తన తల్లి ఎప్పుడూ చెప్పే విషయం గురించి అతను గుర్తు చేసుకున్నాడు. ‘నువ్వు గొప్ప చేసే ప్లేయర్‌గా పేరు తెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి మరింత ఆనందిస్తానని మా అమ్మ చెబుతుంది. ఇప్పటికీ అదే విషయాన్ని చెబుతూ ఉంటుంది. ఆ మాటలకు నేను ఎక్కువ వ...
KMM: భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామ ఆఫీసర్స్ క్లబ్లో జిల్లాస్థాయి టెన్నిస్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
JGL: జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రి ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఆదివారం జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 16మందికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. ఉచిత కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు.
టీమిండియా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. క్రీజ్‌లో ట్రావిస్ హెడ్(20), స్టీవ్ స్మీత్ (25) ఉన్నారు. అంతకుముందు ఉస్మాన్ ఖవాజా(21), మెక్‌స్వీన్(9), లబూషేన్(12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 2, నితీస్ కుమార్ 1 వికెట్లు తీశారు.
ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టెస్ట మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఓ ఘనతను సాధించాడు. టెస్టుల్లో 150 డిస్మిస్పల్స్ మార్క్‌ను తాకాడు. ఇప్పటివరకు 135 క్యాచ్‌లు.. మరో 15 స్టంపింగ్స్ చేశాడు. ఈ జాబితాలో భారత్ తరపున మూడో వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. కాగా 41 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజ్‌లో ట్రావిస్ హెడ్(17),...
ప్రకాశం: గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా సౌత్ జోన్ ఇండియా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ముండ్లపాడు సెయింట్ జేకబ్స్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పాల్గొనాలనుకునే వారు ఈ నెల 20లోపు పేర్లను నమోదు చేసుకోవాలని, ఎంట్రీ ఫీజు రూ. 500 చెల్లచాలన్నారు.
నేడు వెస్టిండీస్‌తో మహిళల భారత జట్టు తొలి టీ20 ఆడనుంది. రాత్రి 7 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. 2019 నుంచి విండీస్‌తో ఆడిన ఏడు టీ20ల్లోనూ గెలిచిన టీమిండియా.. ఇప్పుడా రికార్డును కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. షెఫాలివర్మ, యాస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రాకర్ లాంటి కీలక ప్లేయర్లు లేకుండానే భారత్ బరిలో దిగుతోంది.
KMM: సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలు సోమవారం నుంచి శనివారం వరకు నిర్వహించేందుకు యువజన క్రీడలశాఖ సిద్ధమైంది. ఈనెల 16 నుండి 21 వరకు పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్థాయిల్లో ఎంపిక చేసిన క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు ఉదయం 8 గంటల వరకు సర్దార్ పటేల్ స్టేడియంలో ఉండాలని డీవైఎస్ఓ సునీల్ కోరారు.
హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో జింబాబ్వే మీద ఆఫ్గనిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బింజాబ్వే 19.5 ఓవర్లో 127 పరుగులు చేసి ఆలౌటైంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్థాన్.. 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో ఒమర్జాయ్(34), మమ్మద్ నబీ(24*) మెరుగైన ఆట తీరును కనబరిచారు.
భారత మహిళల హాకీ జూనియర్ జట్టు అదరగొడుతోంది. మస్కట్‌లో జరుగుతున్న టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. దీంతో సెమీ ఫైనల్లో జపాన్ను చిత్తు ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన భారత అమ్మాయిలు 1-3 తేడాతో జపాన్‌పై గెలుపొందారు. ఇక ఆదివారం జరిగే టైటిల్ పోరులో చైనా లేదా సౌత్ కొరియాతో భారత్ తలపడనుంది.