భారత ఫార్ములావన్ యువ కెరటం అతిక మీర్ మరో రికార్డు సృష్టించింది. COTFA కార్టింగ్ సిరీస్ ఐరోపా అంచెలో అతిక మూడో స్థానంలో నిలిచింది. COTFA రేసులో పోడియంపై నిలిచిన తొలి భారత రేసర్‌గా అతిక ఘనత సాధించింది. ఎఫ్-1 అకాడమీ మద్దతు ఇస్తున్న తొలి భారత రేసర్ అయిన అతిక.. గత కొన్ని నెలలుగా ట్రాక్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది.