టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు. టీమిండియా సరైన క్రికెట్ ఆడటం లేదని.. ఫీల్డింగ్ సరిగా లేదని వ్యాఖ్యానించాడు. భారత ప్లేయర్లు కనీసం 4 క్యాచ్‌లు వదిలేశారని అన్నాడు. బంతిని ఆపే క్రమంలో తడబాటుకు గురయ్యారని చెప్పాడు. అలాగే, హార్దిక్ పాండ్యా పెద్ద జట్లపై సరైన ప్రదర్శన చేయలేడని తెలిపాడు.