పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ టీమిండియాపై తన విమర్శలను ఆపడం లేదు. ఇప్పటికే భారత్ సెమీస్ చేరదని వ్యాఖ్యానించి నవ్వులపాలైన అమీర్, ఇప్పటికీ తన బుద్ధి మార్చుకోలేదు. తాజాగా వెస్టిండీస్‌పై భారత్ ‘తొండాట’తో గెలిచిందని సంచలన ఆరోపణలు చేశాడు. హెట్‌మైర్ అవుట్ కాకపోయినా అంపైర్లు ఔట్ ఇచ్చారని వ్యాఖ్యానించాడు. దీనిపై భారత నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.