సంజూ శాంసన్ నికర ఆస్తి విలువ సుమారు రూ.80-90 కోట్లు ఉంది. IPL ఒప్పందం ద్వారా ఏడాదికి రూ.14 కోట్లు, బీసీసీఐ కాంట్రాక్టుతో ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తాడు. వీటితో పాటు మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు. క్రికెట్ మైదానంలోనే కాకుండా, ఆర్థికంగా కూడా సంజూ అత్యంత విజయవంతమైన ఆటగాడిగా దూసుకుపోతున్నాడని నివేదికలు చెబుతున్నాయి.