దేశంలో ఖమేనీ మృతిపై పలు చోట్ల నిరసనలు జరగడంపై టీమిండియా క్రికెటర్ చాహల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘నువ్వు ఉంటున్న దేశాన్ని సపోర్ట్ చేయి లేదంటే నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్లిపో’.. అనే క్యాప్షన్‌తో ఓ వ్యక్తి టీషర్ట్ ధరించిన ఫొటోను ‘X’లో పోస్ట్ చేశాడు. కాగా అంతకుముందు యాంకర్ రష్మి సైతం ఈ ఆందోళనలు చేసే వారిని ఇరాన్ పంపించేయాలని ప్రధాని మోదీని కోరుతూ పోస్ట్ చేసింది.