ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ‘2026 లారస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు టీమిండియా నామినేట్ అయింది. క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారంగా ఈ అవార్డ్‌ను పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్ల మధ్య ఈ పోటీ ఉంటుంది. విజేతను ఏప్రిల్‌లో ప్రకటిస్తారు.