వెస్టిండీస్‌తో జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో గెలిచి టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శనపై బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు. సంజూ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడని పేర్కొన్నాడు. అయితే, చివర్లో దూబే కొట్టిన రెండు ఫోర్లు అత్యంత కీలకమని వ్యాఖ్యానించాడు. ఆ రెండు ఫోర్లే చివరి ఓవర్లో సంజూపై ఒత్తిడిని తగ్గించాయని స్పష్టం చేశాడు.