NRML: బండల్ ఖానాపూర్ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు సర్పంచ్ కళ్యాణి సచిన్ కుమార్ జాదవ్ యూనిఫామ్లు అందజేశారు. గ్రామ పరిశుభ్రత కోసం కార్మికులు చేస్తున్న సేవలు అమూల్యమని పేర్కొంటూ,ప్రజలు కూడా పరిశుభ్రత పరిరక్షణలో సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ ముత్యం, కార్యదర్శి అక్షిత, వార్డు సభ్యులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.