మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలో తన జోరును కొనసాగిస్తుండటం విశేషం. ఏకంగా 109 కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇటీవల కాలంలో ఈ ఘనత సాధించిన ఏకైక చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.