ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఊరట లభించింది. స్టార్ పేసర్ బుమ్రా ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని సమాచారం. తన ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించేందుకే బుమ్రా ఇటీవల BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా బుమ్రా గాయంపై వస్తున్న ఊహాగానాలకు పూర్తిగా తెరపడింది.
IPL-2026 నేపథ్యంలో ముంబైలో 10 జట్ల కెప్టెన్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అందరూ కలిసి సరదాగా గడుపుతూ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లకు భారత ప్లేయర్లే కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు.
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సింగపూర్‌లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. IPLతో కాస్త విరామం దొరకడంతో భార్య, పిల్లలతో కలిసి ఆయన సరదాగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. IPL ముగిసిన వెంటనే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో తలపడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మొదటిసారి సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన నెల రోజుల్లోనే తన ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్ల నుండి 3.5Mకు పెరిగిందని వెల్లడించాడు. ‘IPL అనేది చాలా పెద్ద వేదిక. తాము ఆడుతున్నప్పుడు హైదరాబాద్ నగరం మొత్తం మా వెంటే ఉంటుంది’ అని పేర్కొన్నాడు.
IPL చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2016లో కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఏ ఇతర ఆటగాడు కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లోకి రాలేకపోయాడు. మరి ఈ సీజన్‌లోనైనా ఈ రికార్డు బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.
RCB ఫ్రాంఛైజీ రూ.16,706 కోట్ల భారీ ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నెదర్లాండ్స్ క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి చేయడానికి.. RCB అమ్ముడైన మొత్తంలో 0.5 శాతాన్ని తమకు ఇచ్చినా చాలు అని తెలిపాడు. ఈ మొత్తంతో నెదర్లాండ్స్ క్రికెట్ గతి మారుతుందని వ్యాఖ్యానించాడు.
IPL 2026 నుంచి ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందించింది. ‘ఈ సీజన్ ఆడబోనని డకెట్ ముందే చెప్పాడు. అతనికి రిప్లేస్‌మెంట్ కోసం మరో ఆటగాడిని వెతుకుతున్నాం. ఎవరిని తీసుకున్నామో త్వరలోనే చెప్తాం’ అని తెలిపింది. డకెట్ నిర్ణయంపై ఢిల్లీ సానుకూలంగా స్పందించినప్పటికీ.. IPL రూల్స్ ప్రకారం అతనిపై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
IPL చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లుగా రోహిత్(302), కోహ్లీ(291) 2 & 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ 2026 సీజన్‌లో అగ్రస్థానం కోసం గేల్(357) రికార్డు బ్రేక్ చేయడం కొంచెం కష్టమే అయినా.. రోహిత్‌ను అధిగమించేందుకు మాత్రం కోహ్లీకి ఛాన్స్ ఉంది. ఇందుకోసం ఈ టోర్నీలో రోహిత్ బాదనున్న సిక్సర్ల కంటే కోహ్లీ 13 అధికంగా కొడితే చాలు.
మరో 3 రోజుల్లో IPL 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ 10 జట్ల కెప్టెన్ల సమావేశం కానున్నారు. BCCI మ్యాచ్ రిఫరీలు శ్రీనాథ్, నితిన్ మీనన్, అంపైర్ ప్యానెల్ సభ్యుల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా ఇన్నింగ్స్ టైమర్(60 సెకన్లు), ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, కంకషన్ సబ్‌స్టిట్యూట్, ఒకే ఓవర్‌లో 2 బౌన్సర్లు వంటి అంశాలపై కెప్టెన్లు చర్చించనున్నారు.
న్యూజిలాండ్ మహిళలతో 5వ T20లో సౌతాఫ్రికా 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ముందుగా కెప్టెన్ కెర్ సెంచరీ(105)తో కివీస్ 194/6 స్కోర్ చేసింది. అయితే లక్ష్యచేధనలో ప్రొటీస్ 102/9 పరిమితమైంది. దీంతో 4-1తో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అటు కెర్ 8 వికెట్లు, 276 పరుగులతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది.
రాజస్థాన్ జట్టును అమెరికాకు చెందిన కన్సార్షియం రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ టీమ్ తొలి కెప్టెన్, దివంగత క్రికెటర్ షేన్ వార్న్ ఫ్యామిలీ రూ.450 కోట్లు పొందింది. అదెలా అంటే.. IPL ప్రారంభంలో రాజస్థాన్ క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించినందుకు 4 సీజన్లలో 0.75 చొప్పున 3% యాజమాన్య వాటా వార్న్ సొంతమైంది. దానితోనే వార్న్ కుటుంబం ఇప్పుడు లబ్ధి పొందింది.
RCB తమ తొలి IPL ట్రోఫీని విజయవంతంగా డిఫెండ్ చేయడంతో పాటు రెండో సారీ ఛాంపియన్ కావడమే లక్ష్యంగా 19వ సీజన్ బరిలోకి దిగుతోంది. ఇదే జరిగితే IPLలో టైటిల్‌ను వరుసగా 2 సార్లు కప్ గెలిచిన మూడో జట్టుగా CSK, MI సరసన RCB నిలుస్తుంది. 2010 & 11లో CSK, 2019 & 20లో MI వరుసగా 2 సార్లు టోర్నీ విజేతగా నిలిచాయి. అయితే ఈ సారి RCBకి ఇతర జట్లు గట్టి […]
19వ సీజన్ తర్వాత ధోనీ IPL నుంచి రిటైర్ అవుతాడనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ‘ధోనీ రిటైర్ అవ్వాలా? వద్దా? ఏం చేయాలనేది అతనికే చెప్తా. మీడియాకు కాదు’ అని పేర్కొన్నారు. అటు ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగేలా అయితే రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిందేనని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. CSKలో కీపర్ బాధ్యతల కోసం శాంసన్ ఉన్నాడన్నాడు.
IPL నుంచి తప్పుకుంటున్నట్లు ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే IPL 2025-27 రూల్స్ ప్రకారం.. వేలంలో ఎంపికై, తర్వాత టోర్నీ నుంచి తప్పుకున్న ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం పడుతుంది. గాయం, వైద్యం, అత్యవసర కారణాలకే మినహాయింపు ఉంటుంది. దీంతో ఇప్పటికే ఈ సీజన్ నుంచి తప్పుకున్న డకెట్.. 2027 & 28 సీజన్లకూ దూరం అయినట్లే.