ఐసీసీ ఈవెంట్లలో 20 సార్లు సెమీఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరడంతో ఈ ఘనత సాధించింది. ODI WC – 8 సార్లు, T20 WC – 6 సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో 6 సార్లు సెమీస్ చేరుకుంది. భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా (18), న్యూజిలాండ్ (18) ఉన్నాయి.