టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. సౌతాఫ్రికా, జింబాబ్వేలపై చక్రవర్తి భారీగా పరుగులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శలు వస్తుండగా.. ఇర్ఫాన్ పఠాన్ అతడికి మద్దతుగా నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో చక్రవర్తి ఖచ్చితంగా రాణిస్తాడని పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.