టీ20 ప్రపంచ కప్లో భాగంగా మార్చి 1న కోల్కతా వేదికగా భారత్, వెస్టిండీస్ తలపడనున్నాయి. సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన వాతావరణ శాఖ ఆరోజు వర్షం పడే అవకాశం లేదని, 23 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని స్పష్టం చేసింది.