T20 WC వేదికగా జింబాబ్వే చెత్త రికార్డులు మూటగట్టుకుంది. T20ల్లో 2 వరుస మ్యాచుల్లో 250+ రన్స్ సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. జింబాబ్వేపై 23న విండీస్ 254/6 స్కోర్ చేయగా.. రాత్రి భారత్ 256/4 చేసింది. ఈ రెండూ T20 WCలోనే టాప్-3 టీమ్ స్కోర్స్లో ఉండటం గమనార్హం. అలాగే ఓ T20 WC మ్యాచులో అత్యల్పంగా 26 డాట్ బాల్స్ వేసిన జట్టుగానూ ఇంగ్లండ్(2016లో vs SA) సరసన నిలిచింది.