జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచులో భారత్ 72 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 184/7కే పరిమితమైంది. ఆ టీమ్ తరఫున బెనెట్ 97* పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. మన బౌలర్లలో అర్ష్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంతో సూర్యసేనకు సెమీస్ ఆశలు సజీవం కాగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది.