జింబాబ్వేతో మ్యాచ్లో భారత్ 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలోనే ప్రపంచకప్లో అత్యంత వేగంగా 150 పరుగులు (12.4 ఓవర్లలో) పూర్తి చేసిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అలాగే, టీ20ల్లో వేగంగా 200 పరుగులు (16.4 ఓవర్లలో) సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. శ్రీలంక (16.2 ఓవర్లలో), ఇంగ్లండ్ (16.3 ఓవర్లలో) తొలి రెండో స్థానంలో ఉన్నాయి.