ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు పాథుమ్ (22), మెండిస్ (34) శుభారంభం అందించినా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మన్ 3, మెహిదీ హసన్ 2, తస్కిన్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళల జట్టు 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 413 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా 369 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (125; 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకట్టుకుంది. దీప్తి శర్మ (72), హర్మన్‌ప్రీత్ (52) రాణించినా ఓటమి తప్పలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12లో పాట్నాపైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఇవాళ ఇండోర్ వేదిక జరిగిన మ్యాచ్‌లో పాట్నాపైరేట్స్ 33-30 తేడాతో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. అయితే, ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించిన దబాంగ్ ఢిల్లీపై పాట్నా పైరేట్స్ తన మొదటి విజయాన్ని సాధించింది. కాగా, పాట్నాపైరేట్స్ ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓడిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్ ప్లేయర్ షాహిన్ అఫ్రిదిపై పాక్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తీవ్ర విమర్శలు చేశాడు. ‘ఒమన్ బౌలర్ షా ఫైజల్‌ను చూసి ఎలా బౌలింగ్ చేయాలో షాహిన్ నేర్చుకోవాలి. అతడి నుంచి నోట్స్ తీసుకుని, సూపర్-4లో భారత్-పాక్ మ్యాచ్‌కు సన్నద్ధం కావాలి. అఫ్రిది ఎలా బౌలింగ్ బ్యాటర్లందరికీ తెలిసిపోయింది. అందుకే అతడు ప్లాన్ Bని అమలు చేయాలి’ అని సూచించాడు.
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా.. ఇవాళ శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. ఇప్పటికే గ్రూపు దశలో గ్రూపు బీలో శ్రీలంక టాప్‌లో, బంగ్లాదేశ్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది.
వన్డే ఫార్మాట్లో భారత క్రికెటర్ స్మృతి మంధాన ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ రికార్డు సృష్టించింది. కేవలం 50 బంతుల్లోనే శతకం పూర్తి చేసి.. భారత్ తరఫున వన్డేల్లో తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. కాగా, గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ (52 బంతుల్లో సెంచరీ) పేరిట ఉండేది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టీమ్ విధ్వసం సృష్టించింది. 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ కేవలం 75 బంతుల్లోనే 138 పరుగులతో చెలరేగింది. కాగా, ఈ సిరీస్ 1-1 సమంతో ఉండగా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా సాయంత్రం 7:30లకు పట్నాపైరేట్స్, దబాంగ్ ఢిల్లీ తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన దబాంగ్ ఢిల్లీ ఈ మ్యాచ్ కూడా గెలవాలని చూస్తోంది. అదే స్టేడియంలో రాత్రి 9గం.లకు హర్యానా స్టీలర్స్, తమిళ్ తలైవాస్ జట్లు తలపడనున్నాయి.
ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా రేపు జరగబోయే భారత్-పాక్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లు సూపర్-4లో మరోసారి తలపడనున్నాయి. అయితే పాక్ జట్టుకు దుబాయ్ స్టేడియంలో ఆడిన అనుభవం చాలా ఎక్కువ ఉండటంతో ఈ మ్యాచ్ కీలకం కానుంది. వరల్డ్ కప్ చరిత్రలో పాక్ చేతిలో భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది. అది కూడా దుబాయ్ స్టేడియంలోనే కావడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆసియా కప్ 2025లో నిన్న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ బ్యాటింగ్‌కి రాకపోవడంపై తాజాగా స్పందించాడు. ‘చివరి మూడు ఓవర్లు ఉన్నప్పుడు బౌలర్ ఆర్షదీప్ బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాని నాతో చెప్పాడు. అందుకే తనకు అవకాశం ఇచ్చాను. జట్టులోని ప్లేయర్లందరికీ బ్యాటింగ్ ప్రాక్టిస్ ఉండాలని.. అర్షదీప్,కుల్దీప్, హర్షిత్‌కు బ్యాటింగ్ ఇచ్చాను’ అని చెప్పాడు.
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం కల్పించకపోవడంపై అతడు తాజాగా స్పందించాడు. బ్యాటింగ్ చేయగలిగే స్పిన్నర్లకు అవకాశాలు కల్పిస్తున్న సమయంలో కూడా తాను స్పెషలిస్టు బౌలర్‌గానే ఆడతానని కుల్దీప్ స్పష్టంచేశాడు. బ్యాటింగ్ కాంబినేషన్స్ వల్ల తాను ఆడలేకపోయానని వెల్లడించాడు. అయితే తన స్కిల్స్ గురించి, బ్యాటింగ్ గురించి ఎప్పుడూ చర్చ రాలేదని తెలిపాడు.
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై క్రికెట్ దిగ్గజం గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని తెలిపాడు. బ్యాటింగ్‌కు దిగనంత మాత్రాన కంగారుపడాల్సిన అవసరం లేదన్నాడు. మిగతా ప్లేయర్ల కోసం అలా చేసినట్లు వెల్లడించాడు. వినూత్నంగా ఆలోచించే కెప్టెన్‌గా సూర్య నిలుస్తాడని అభినందించాడు.
భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20ల్లో అద్భుతమైన రికార్డు సృష్టించాడు. ఒమన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో వినాయక్ శుక్లాను ఔట్ చేయడం ద్వారా 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కేవలం 64 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయంగా ఇప్పటికే 24 మంది బౌలర్లు ఈ మార్కును చేరుకున్నారు.
ఆసియా కప్‌లో టీమ్ఇండియా ఓమన్‌పై 21 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శాంసన్ 56 పరుగులతో రాణించాడు. అనంతరం, 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఒమన్ తరఫున కలీమ్ (64), మీర్జా (51) అద్భుతంగా ఆడారు.
అబుదాబీ వేదికగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్(56) అర్థ శతకంతో రాణించగా.. అభిషేక్ శర్మ(38), తిలక్ వర్మ(29), అక్షర్ పటేల్(26) పర్వాలేదనిపించారు. ఇక ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, జితేన్ రమానంది, ఆమిర్ కలీమ్ తలో 2 వికెట్లు తీశారు.