సూపర్-8 గ్రూప్-2లో భాగంగా పల్లెకెలె వేదికగా రేపు పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్, ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే దాదాపు సెమీస్‌కు చేరుకుంటుంది. మరోవైపు, తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో పాక్ ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓడితే పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
భారత్ వేదికగా మ్యాచులు ఆడటమంటే చాలా ఇష్టమని న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ తెలిపాడు. భారత్ అభిమానులు న్యూజిలాండ్ జట్టుకు మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నాడు. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ జరిగిన సరే.. కొందరు అభిమానులు బ్లాక్ జెర్సీలు ధరించి తమకు సపోర్ట్ చేస్తారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జరుగుతున్న T20 WC కివీస్ తన తర్వాతి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.
జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ హిట్టర్ హెట్మేయర్ మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అర్థ సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తరఫున T20 WCలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో 22 బంతుల్లో తన పేరిటే ఉన్న రికార్డును తనే బ్రేక్ చేశాడు.
ఈనెల 26న సూపర్-8 పోరులో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2022లో ఆస్ట్రేలియా వేదికగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక జింబాబ్వే జట్టు భారత గడ్డపై భారత్‌తో చివరిసారిగా 2002లో తలపడింది.
అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంతో, అతడిని తుది జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, మాజీ క్రికెటర్ కైఫ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో అభిషేక్‌కు విశ్రాంతినివ్వడం మంచిదన్నాడు. ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదని, WCలో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకమని చెప్పాడు. అభిషేక్ స్థానంలో శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.
సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకున్న జింబాబ్వే, ఇప్పుడు పటిష్టమైన వెస్టిండీస్ జట్టుతో తలపడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో రెండు జట్లు కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. దీంతో, ఈ ‘అజేయ’ జట్ల మధ్య జరిగే పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్‌తో మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ విజయంతో T20 WCలో కెప్టెన్‌గా 13వ విజయాన్ని నమోదు చేశాడు. తద్వారా T20 WC చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్(12)ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ధోనీ(21), విలియమ్సన్(14) తొలిరెండు స్థానంలో కొనసాగుతున్నారు.
T20 WC సూపర్-8లో భాగంగా ఈనెల 26న జింబాబ్వేతో భారత్ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. అలాగే, వాషింగ్టన్ స్థానంలో అక్షర్ పటేల్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడితే, ప్రపంచకప్‌లో భారత్ పోరాటం ముగిసినట్లే.
అహ్మదాబాద్ స్టేడియంలో భారత్‌ను చిత్తుగా ఓడించిన సౌతాఫ్రికా.. గ్రూప్ దశలో ఇదే స్టేడియంలో మూడు మ్యాచ్‌లు ఆడింది. దీనివల్ల పిచ్ పరిస్థితులపై ఆ జట్టుకు పూర్తి అవగాహన ఏర్పడింది. వెస్టిండీస్‌తో మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరగనుంది. దీంతో, ‘సౌతాఫ్రికా ఒకే స్టేడియంలో ఇన్ని మ్యాచ్‌లు ఆడేలా ICC షెడ్యూల్‌ను ఎలా రూపొందించింది?’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన 2023 WC ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమిని భారత్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. తాజాగా S-8లో సౌతాఫ్రికా చేతిలో కూడా ఇదే స్టేడియంలో భారత్ చిత్తుగా ఓడింది. ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరగబోతోంది. దీంతో, ‘భారత్‌కు అచ్చిరాని ఈ స్టేడియంలోనే కీలక మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించాలి?’ అంటూ అభిమానులు SMలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా T20 WC బరిలోకి దిగిన భారత్‌కు దక్షిణాఫ్రికా భారీ షాక్ ఇచ్చింది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడగొట్టినప్పటికీ బౌలర్లు 180+ స్కోర్‌ను ఇచ్చారు. ఇక బ్యాటింగ్‌లో ఏ ఒక్క బ్యాటర్ కూడా ధాటిగా పరుగులు చేయలేకపోయాడు. ఈ ఒక్క ఓటమితో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందన్న ఆశలు అభిమానుల్లో సన్నగిల్లాయి.
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి పాలవ్వడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ ఓటమితో భారత్ -3.800 నెట్ రన్ రేట్‌తో గ్రూప్-1లో చివరి స్థానంలో ఉంది. దీనివల్ల భారత్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటికీ సెమీస్ చేరుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై విజయం సాధించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే సెమీస్ చేరుకుంటుంది.
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపై అశ్విన్ తీవ్రంగా మండిపడ్డాడు. జట్టు ఎంపిక సరిగా లేదని కోచింగ్ స్టాఫ్‌ను తప్పుపట్టాడు. జట్టులో నుంచి అక్షర్ పటేల్‌ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదన్నాడు. ‘టీ20ల్లో అక్షర్ అత్యంత విలువైన ఆటగాడు.. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించాడు’ అని పేర్కొన్నాడు. అలాగే, రింకూను జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పొందింది. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు తెలివైన బంతులు సంధించారని అభిప్రాయపడ్డాడు. భారత బ్యాటర్ల షాట్ సెలక్షన్ పేలవంగా ఉందన్నాడు. డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రేవిస్.. బ్యాట్ మీదకు బంతి రాకున్నా వారు పరిస్థితులకు తగ్గట్లు చక్కగా ఆడారని కొనియాడాడు.