»Subhaman Gil Recover The Dengue Fevar He Will Play In Pakistan Match
IND vs PAK మ్యాచ్‌కు గిల్ వచ్చేస్తున్నాడు
వన్డే ప్రపంచకప్‌లో స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగీ ఫీవర్ కారణంతో ఇప్పటికే రెండు మ్యాచ్‌లకు దూరమయిన సంగతి తెలిసిందే. రేపు పాక్ మ్యాచ్‌లో గిల్ రాకపోవచ్చే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం గిల్ ఫీవర్ నుంచి కోలుకున్నారని తెలుస్తోంది.
IND vs PAK: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాక్ (IND vs PAK) మ్యాచ్‌కు సమయం దగ్గరైంది. అక్టోబర్ 14న అనగా రేపు అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. డెంగీ కారణంతో స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పాక్ మ్యాచ్‌కు గిల్ కోలుకుంటాడని అందరు అనుకున్నారు. కానీ ఇటీవల ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కానీ గిల్ తొందరగానే కోలుకుని పాక్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరుకున్నాడు. గిల్ కోలుకుని రావడం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.
ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల టేబుల్లో టాప్‌లో ఉన్న ఇండియా.. పాక్‌పై కూడా విజయం సాధిస్తే ఇక తిరుగుండదు. ఈ మ్యాచ్‌కి టాప్ ఫామ్‌లో ఉన్న గిల్ అవసరం చాలా ఉంది. అహ్మదాబాద్ వచ్చిన గిల్ ఇప్పటికే నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడని సమాచారం. జట్టు సెలక్షన్లో గిల్ ఉంటే ఇషాన్ కిషన్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అవుతాడు. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ శార్థూల్ ఠాకూర్‌ను పెట్టాలని టీమిండియా జట్టు భావిస్తున్నట్లు సమాచారం. అతని స్థానంలో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి ఛాన్స్ ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. అహ్మదాబాద్ స్టేడియం పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జట్టులోకి షమీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.