»India Who Won The Toss And Chose To Field Will With Pakistan 12th Match
IND vs PAK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..మ్యాచ్ గెలుస్తుందా?
కాసేపట్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ మొదలుకానుంది. ఈ క్రమంలో టాస్ గెల్చిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోగా..పాకిస్తాన్ బ్యాటింగ్ తీసుకుంది. అయితే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న ఈ పీచ్‌లో ఈ జట్టు గెలుస్తుందో చూడాలి మరి.
India who won the toss and chose to field will with pakistan 12th match
ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ టోర్నమెంట్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కాసేపట్లో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే టాస్ గెల్చిన భారత టీం బౌలింగ్ ఎంచుకుంది. ఇక పాకిస్తాన్ టీం ఆటకు దిగనుంది. ఈ ఐసిసి పురుషుల ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ రెండూ చెరో రెండు మ్యాచ్‌లు ఆడాయి. 50 ఓవర్ల ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఇది ఎనిమిదో మ్యాచ్ కాగా, ప్రపంచకప్‌లలో పాకిస్థాన్ ఇంకా భారత్‌ను ఓడించలేదు. గత నాలుగు దశాబ్దాలలో 1980ల నుంచి ఇరు జట్లు మొత్తం 204 సార్లు ఆడాయి. ఆ క్రమంలో భారతదేశం 73 మ్యాచుల్లో విజయం సాధించగా..పాకిస్తాన్ 88 మ్యాచ్‌లు గెలిచింది. 134 వన్డేల్లో పాకిస్థాన్ 73 మ్యాచ్‌లు ఆడగా, భారత్ 56 మ్యాచ్‌లు గెలిచింది.
ప్రపంచకప్‌లో భారత్ మొత్తం 7 వన్డేల్లోనూ విజయం సాధించింది. టీ20ల్లో భారత్ 5 గెలిచింది. పాకిస్థాన్ ఒకసారి గెలిచింది, ఒకటి టై అయింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచింది. వెదర్ రిపోర్ట్ ప్రకారం మ్యాచ్ రోజున అహ్మదాబాద్‌లో వర్షం పడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే నరేంద్ర మోడీ స్టేడియం మంచి బ్యాటింగ్ ఉపరితలాన్ని ప్రదర్శిస్తూ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని అంటున్నారు.