»Ind Vs Aus Final World Cup 2023 Match Live From 7am
Ind vs aus final match: ఎల్లుండి ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్..కానీ ఉదయం 7 నుంచే లైవ్
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ 2023 భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో నవంబర్ 19న లైవ్ కార్యక్రమాలు ఉదయం నుంచే ప్రారంభమవుతాయని స్టార్ స్పోర్ట్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ind vs aus final world cup 2023 match live from 7am
IND vs AUS ఫైనల్ వరల్డ్ కప్ 2023(icc odi world cup 2023) మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2:00 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. అయితే ఈ మ్యాచ్ లైవ్ మాధ్యాహ్నం 2 నుంచి మొదలు కానుండగా.. ఉదయం 7 నుంచే వివిధ కార్యక్రమాలను లైవ్ ఇవ్వనున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ఈ మేరకు ప్రకటించింది. అయితే ఈ సారి భారత్ ఫైనల్ చేరడంతో ఉదయం నుంచి పలు యాంకర్లు, క్రికెట్ అనలిస్టులు మ్యాచ్ గురించి వివరాలు తెలియజేయనున్నారు. అయితే ఈ మ్యాచ్ టాస్ మాత్రం యాథావిధిగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఆదివారం మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార వివరాలు
భారతదేశం- స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్‌స్టార్
పాకిస్తాన్- PTV స్పోర్ట్స్
ఆస్ట్రేలియా- 9నౌ, ఫాక్స్ స్పోర్ట్స్
US, కెనడా- ESPN+
UK- స్కై స్పోర్ట్స్, My5
న్యూజిలాండ్- స్కై స్పోర్ట్, స్కై గో
ఇక భారత్ తరఫున :రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు.
ఆస్ట్రేలియా తరఫున: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(w), గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా ఆటకు దిగనున్నారు.