మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పరుగుల తేడాతో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం పొందింది. మొదట ఆస్ట్రేలియాపై టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లోనే 123 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. గైక్వాడ్ చేసిన తొలి అంతర్జాతీయ సెంచరీ ఇదే కావడం విశేషం.
ఆ తర్వాత మరో బ్యాటర్ జైశ్వాల్ 6 పరుగులకు ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ డకౌట్ అవ్వడంతో భారత అభిమానులు నిరుత్సాహపడ్డారు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 39 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఆ తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు భారత బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. ఆసీస్ బ్యాటర్లలో మాక్స్వెల్ 104 పరుగులు చేసి ఆసీస్ కు విజయాన్ని అందించాడు. ఆసీస్ కెప్టెన్ మ్యాథ్యూ వేడ్ 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 35, హార్డీ 16, ఇంగ్లీస్ 10, స్టోయినీస్ 17పరుగులకు ఔట్ కాగా డేవిస్ డకౌట్ అయ్యాడు. దీంతో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా 225 పరుగులు చేసి విజయం సాధించింది.