»Star Players Who Did Not Get A Place In The T20 Series Fans Fire
TeamIndia: టీ20 సిరీస్‌కు చోటు దక్కని స్టార్ ఆటగాళ్లు..ఫ్యాన్స్ ఫైర్
ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. అయితే జట్టులో సంజూ శాంసన్, చాహల్, భువనేశ్వర్ వంటివారికి చోటివ్వకపోవడం పట్ల పలువురు క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో క్రికెట్ అభిమానులంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. వరల్డ్ కప్ అందని ద్రాక్షలా మారడంతో రోహిత్ సేన ప్రస్తుతం బాధతో ఉంది. ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించి కప్ గెలుచుకుపోయింది. అయితే ప్రపంచ కప్ తర్వాత ఆసీస్‌తోనే టీ20 సిరీస్‌కు భారత్ రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఈ టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ టీ20 సిరీస్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు ఉంటాయి. చివరి రెండు టీ20లకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. మొదటి మూడు మ్యాచులకు శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఇకపోతే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్, బుమ్రా, షమీ, సిరాజ్, కుల్దీప్ యాదవ్ లకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది.
ఈ సిరీస్‌కు సంజూ శాంసన్, చాహల్, భువనేశ్వర్ వంటివారిని బీసీసీఐ పక్కన పెట్టింది. ఈ తరుణంలో ట్విట్టర్ వేదికగా వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చాహల్ ట్విట్టర్లో ఎమోజీతో తన బాధను వ్యక్తం చేయగా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అలాగే భువనేశ్వర్ గురించే బీసీసీఐ పట్టించుకోకపోవడంతో పలువురు సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. సెలక్షన్స్ టీమ్ సరిగా లేదని కామెంట్స్ చేస్తున్నారు.
నవంబర్ 23వ తేది నుంచి ఈ టీ20 సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ విశాఖపట్నం వేదికగా ప్రారంభం కానుంది. ఇకపోతే స్టార్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్‌ను బీసీసీఐ పట్టించుకోలేదు. ఆ బ్యాటర్‌ను పక్కనపెట్టడంతో అభిమానులు నిరాశచెందుతున్నారు. వికెట్ కీపర్‌గా కమ్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్, జితేష్ శర్మలను బీసీసీఐ ఎంపిక చేసింది. వరల్డ్ కప్‌లో ఓటమితో నిరాశలో ఉన్న భారత ఫ్యాన్స్‌కు ఈ సిరీస్ విజయంతో కాస్త ఓదార్పును ఇచ్చేందుకు టీమిండియా సిద్ధమైంది.