»Indian Air Force Airshow Before World Cup Final Match
Aerobatic : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు భారత వాయుసేన ఎయిర్‌షో
అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వాయుసేన ప్రేక్షకులను అచ్చెరవొందేలా ఓ ఎయిర్ షో సిద్దం చేసింది. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీం యుద్ధవిమానలతో స్టేడియం గగనతలంపై విన్యాసాలు చేయనున్నారు.
అహ్మదాబాద్(Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రాంభానికి ముందు భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ బృందం ఏరోబాటిక్ (Aerobatic) ప్రదర్శనను నిర్వహించనుంది. న్యూజిలాండ్‌పై విజయం సాధించడంతో, 1983, 2011లో ట్రోఫీని గెలుచుకున్న భారత్ ఇప్పుడు నాలుగోసారి వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఎయిర్ ఫోర్స్(Air Force)కు చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీం యుద్ధవిమానలతో స్టేడియం గగనతలంపై విన్యాసాలు చేయనున్నారు. వికర్టీ ఫార్మేషన్, లూప్ మెనూవర్స్, బ్యారెల్ రోల్ ఫార్మేషన్, ఆకాశంలో వివిధ ఆకృతుల డిజైన్ వంటి విన్యాసాలు నిర్వహించనున్నట్టు వాయుసేన అధికారిక ప్రతినిధి తాజాగా మీడియాకు తెలిపారు.
గ్లోబల్ పాప్ సింగర్ దువా లిపా (Dua Lipa) కూడా ఫైనల్ క్లాష్‌కు ముందు వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపింది. ప్రపంచ కప్ ప్రారంభంలో ఓపెనింగ్ వేడుకను నిర్వహించకూడదని బీసీసీఐ (BCCI) నిర్ణయించగా, అక్టోబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడే ముందు సంగీత కార్యక్రమం జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.ఇక ఈ మ్యాచ్ తిలకించేందుకు ప్రధాని మోదీ (Pmmodi) ముఖ్యఅతిథిగా హాజరవుతారన్న సమాచారం ఉంది. కాగా, ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది.