IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. ఆదివారం బెంగళూరులో జరిగిన అయిదో టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది. చివరి ఓవర్లో గెలుపు కోసం ఆసీస్ 10 పరుగులు చేయాల్సి ఉంది. భారత పేసర్ అర్షదీప్ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. దీంతో భారత్ గెలిచింది.
ఆస్ట్రేలియాకు నిర్దేశించిన లక్ష్యం చిన్నదే. కానీ బౌలర్లు రాణించడంతో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఆసీస్ 10 పరుగులు చేయాల్సి ఉంది. కానీ అర్షదీప్ బౌలింగ్‌తో వాళ్లను కట్టిపడేశాడు. రెండు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. మూడో బంతికి వేడ్‌ను ఔట్ చేశాడు. తర్వాత బంతుల్లో కూడా ఆసీస్‌కు సింగిల్ రన్స్నే ఇచ్చాడు. బ్యాటింగ్‌తో శ్రేయస్ రాణిస్తే.. అక్షర్, బిష్ణోయ్, ముకేశ్, అర్షదీప్ బౌలింగ్‌తో ఆసీస్‌పై విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్(53) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అక్షర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు.