మూడో టీ20లో ఆఫ్గానిస్థాన్‌తో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం కావడమే ఉంది. అయిదు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్లో భారత ఆటగాళ్లు పాల్గొంటారు. అయితే ఈ ఏడాది జూన్‌లో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
Rohith sharma: మూడో టీ20లో ఆఫ్గానిస్థాన్‌తో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం కావడమే ఉంది. అయిదు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్లో భారత ఆటగాళ్లు పాల్గొంటారు. అయితే ఈ ఏడాది జూన్‌లో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటినుంచే జట్టు ఎంపికలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తుది 15 మంది జాబితాను ఖరారు చేయలేదని తెలిపారు. మేనేజ్మెంట్ దృష్టిలో మాత్రం పది ప్లేయర్లు ఉన్నారని రోహిత్ శర్మ తెలిపారు.
జట్టు కూర్పు, బ్యాటింగ్ కాంబినేషన్‌పై కసరత్తులు చేస్తున్నామని రోహిత్ తెలిపారు. వెస్టిండీస్, యూఎస్ఏ పిచ్ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దానికి తగ్గట్టుగా జట్టు ఎంపిక ఉంటుంది. నాకు, కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఈ విషయంలో ఆందోళన లేదన్నారు. ఎందుకు మీరు ఎంపిక కావడం లేదనే దానిపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
జట్టులోని ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడం అసాధ్యం. కెప్టెన్‌గా నేను నేర్చుకున్నది అదే. వరల్డ్ కప్ కోసం ఎంపికైతే 15 మంది సంతోషపడతారు. తుది జట్టులో 11 మంది స్థానం దక్కిన వాళ్లు ఇంకా సంతోషపడతారు. అలా అని ప్రతిసారి జట్టులో ఉన్నవాళ్లందరినీ సంతోషపెట్టలేం. బెంచ్‌కే పరిమితమయ్యే నలుగురు ప్లేయర్లు కూడా తమను ఎందుకు ఆడించడం లేదని అడుగుతారు. జట్టుగా మనమేం సాధించాలనేది చాలా ముఖ్యమని రోహిత్ తెలిపారు.