»Coaching Centers Central Education Department Has Issued New Guidelines
Coaching Centers: నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర విద్యాశాఖ
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
Coaching Centers: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతో పాటు వాళ్లకు సరైన సౌకర్యాలు కల్పించడం, బోధనా విధానాలు మెరుగుపరచడంలో కేంద్ర విద్యాశాఖ పలు సూచనలు చేసింది. సెకండరీ పాఠశాల విద్య పూర్తి చేసిన వారిని మాత్రమే కోచింగ్ కోసం పేరు నమోదు చేసుకునేందుకు అనుమతించాలి. 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోకూడు. అర్హులైన సిబ్బందిని మాత్రమే నియమించుకోవాలి.
తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసిన వారినే తీసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు. సిబ్బంది అర్హత, కోచింగ్ సెంటర్ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, పీజు రిఫండ్ గురించి సరైన సమాచారం వెబ్సైట్లో రూపొందించాలి. విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్‌లను రిజిస్ట్రేషన్ చేయాలి. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.