ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి, సలార్ 2, స్పిరిట్ లాంటి సినిమాల మధ్య మారుతితో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి రాజాసాబ్గా టైటిల్ అనౌన్స్ చేసిన ఈ సినిమా అప్పుడే రిలీజ్ అంటున్నారు.
Prabhas: సలార్‌తో సాలిడ్ కంబ్యాక్ అయిన ప్రభాస్.. ఎట్టకేలకు సంక్రాంతికి రాజాసాబ్ టైటిల్ అనౌన్స్ చేసి అఫీషియల్‌గా మారుతి సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో వింటేజ్ డార్లింగ్‌ను చూపించోతున్నాడు మారుతి. రాజాసాబ్ ఫస్ట్ లుక్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అనేది ఆసక్తికరంగా మారింది. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ సినిమాలతో అలరించిన ప్రభాస్.. ఈ ఏడాది కూడా రెండు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. రీసెంట్‌గానే కల్కి రిలీజ్ డేట్ లాక్ చేసిన సంగతి తెలిసిందే.
మే 9న పాన్ వరల్డ్ టార్గెట్‌గా కల్కి 2898 ఏడీ రిలీజ్ కానుంది. మరి రాజా సాబ్ ఎప్పుడు థియేటర్లోకి వస్తాడు? అంటే, ఈ ఇయర్ ఎండింగ్లో వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 22న సలార్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు ప్రభాస్. ఇప్పుడు అదే సమయంలో.. రాజాసాబ్గా రావడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో క్రిస్మస్ టార్గెట్‌గా రాజాసాబ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.
ఈ మూవీలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమా.. పక్కా మారుతి మార్క్‌తో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతోంది. ఏదేమైనా.. ఈ ఏడాదిలో కూడా ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రానున్నాయి. మరి కల్కి, రాజాసాబ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో చూడాలి.